ఒక వీరుని జననం;
మన్యం వీరుని జననం!!
తెల్లదొరల గుండెలను దడదడలాడించి,
నిద్రలో రోదనల వేదనలు రేపిన తెలుగు వీరుడి జననం!
మన్యం జనంలో చైతన్యం సెగలు నింపి నిప్పురవ్వలు లేపిన అగ్నిశిఖరపు పాలకవీరుడు,మహావీరుడు!!
సూర్యచంద్రుల తేజోమయ కాంతులు ధరణి పొందేవరకు;
ఈ ధీరుని కీర్తి దశదిశలా వ్యాప్తి నొందు!
గెరిల్లా పోరాటం సాగించిన యోధుడు ఈ మహా ఆంధ్ర సూర్యుడు,!!
ఆ,ఈ మహావీరుడే!! రాజమహేంద్రవర రారాజే!
ఈ అల్లూరి సీతారామరాజు, !!
తెలుగు వాడిలో వేడి,
తెలుగు వారిలో ఉడుకు రక్తం,
తెలుగు వారిలో పౌరుషం,
తెలుగు వారిలో చైతన్యం ,
ఉన్నంతవరకు నీవు సజీవుడవే! ఓ!! సీతారామరాజా! ఓ!ఓ!! అల్లూరి సీతారామరాజు! నీకు జననమే! మరణం లేదయ్యా!! నీవే చిరంజీవి! చిరస్మరణీయడవు..ఓ మన్యం విప్లవ వీరా....
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్.( చురకశ్రీ )కావలి.