నాలో నీవు నీలో నేను అదే మన లవ్వు;
నవ్వవే; చిన్నదాన నవ్వితే నీలోని నవరత్నాలు రాలునులే!
నా నోటితో ఏరి నీ మెడలో మంగళ సూత్రం కట్టి నిన్ను ఏలుతానులే అమ్ముడు!!
ఆగు ఆగు పిల్లగాడా! నీ దుడుకు ఆపు! నా అందగాడా!!
నీ కొంటె చూపులతో పలకరింపులు చేసి;
నా హృదయాన్ని కదిలించి నన్ను నీ మాయలో దింపి, ఆకాశన ఎత్తావులే! కొంటె పిల్లగాడా!!
నీవేమి తక్కువ కాదులే స్వర్ణా నీవే! నాపై వలపు బాణాలు విసిరి, ఉసిగొల్పి!
నాలో ప్రేమ అలల తాకిడి లేపి! నిద్రాహారాలు లేక పహారా కాసానులే ఓ! నా వయ్యారి సరస రసమయ సుందరి!!
ఆ మాటలే నన్ను నీ చెంత చేరునట్లు చేసావులే! నవరసపోషకుడా!!
నా మనస్సు దోచి నా దోసిటలో నీ దోసిట దాచేట్లు చేసావులే! ఓరి!! నా సఖుఃడా!నా ప్రియుడా!!
ఇక అరమరకలు లేకుండా ,విరహాలకు విరమణ చేసి ముందుకు సాగుదాంలే! ఏ మంటావు? నా నవ్వుల పువ్వులరాణీ!!
ఇంతదాక వచ్చాక ,నచ్చాక చేసేది ఏముంది,చెప్పేది ఏముంది!! నన్ను కవ్వించి నవ్వించే లవ్వుల రాజా! తాజాగా కలిసి మజా! చేద్దాం!! పదా, పదా సంధ్యపొద్దు దాటిపోతుంది;
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.