ఒక అక్షరం ఆగింది!
ఒక పదం రాలిపోయింది!!
ఒక పంక్తి సృష్టిధాటికి తలవంచి దారి ఇచ్చింది!
ఒక వచనం జీవిత- జీవన కవచాన్ని దాటి తన స్థిర గమనం చేరింది!
ఒక పేజీ మలచబడి పలచబడి చినిగింది!!
ఒక జ్ఞానపుస్తక వృక్షం ఆయువు తుఫాను తాకిడికి తల్లడిల్లి స్వర్గసీమ తీరానికి తాకింది!!!
ఒక స్వర పేటిక/ కలంపోటు తనువు చాలించి శవపేటికలో సీతలా అవనిలో చేరి తరలిపోయింది!!
శోక రామయ్యలా! కవితా సాహితీ ప్రియుల హృదయాలను శోకసాగర ఉప్పెనలో నింపి దాటివెళ్ళింది!!
అయినా;
వేవేల యుగళ,విరహ గీతాలు; అనంత హృదయ అనంతగిరుల మదిని జీవనదిలా సాగే!
ఒక్కొక్క విప్లవగీతం!! హిమగిరి శిఖరంపై నిలిచింది!
అక్షర సిరిశ్రీ!! పలు గాత్రాలను వెలుగు "వెన్నెల"ను నింపింది
అదే!! అదే!!!
"సిరివెన్నెల సీతారామశాస్త్రి" కలం రహస్యం, నవరసాల విహారం!
అదే ఆయన రచన కౌసల్యం!!
నే అందించే శోకతాప హృదయాంజలి...
చురకశ్రీ, సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ ,కావలి.