వారం, వారం అంటూ.. ఏండ్లు గడిచిపోతుంటే;
జీతపు జీవుల కండ్లు కాయలు చుండే ;
ధరలు ఆకాశానికి చేరువ అగుచుండె ;
అందుకోవడానికి నిచ్చెనలు వేసిన దండగ అగుచుండె! పడగ విప్పిన ధరల కాలసర్పాలు విషపుజ్వాలలు చిమ్ముచుండె !!
పించను దారులు వేచివేచి అప్పులపాలై కడదేరిపోసాగే;
ధరలసూచిక అదుపు దాటి హద్దులేక పద్దుల సంఖ్య పెరుగుచుండే !!
ఇప్పటికైనా నీ పిడికిలిన దాచిన నివేదిక విడువు ప్రభూ!!!
మేమున్ సేవకులమే!; మాకు మీకు జగడం వలదు !
ఆంధ్ర జగతి పాలకా! జగనన్నా !
రావలసిన, ఇవ్వవలసిన రాయితీలు ఆపకయ్యా!!ఆశజీవులు ఎదురు చూస్తుండురు
రాజయ్యా కొడుకా!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.