మనలో వాడిఉంది!వేడిఉంది!! మన పిడికిలి ఉక్కుసంకెళ్లు తెంచే శక్తి ఉంది!
సమస్య సాధనలో ఉక్కు సంకల్పపు యుక్తి ఉంది!! అందుకే.. రండి! రండి! రారండి!! తరలిరండి!! సోదరిసోదరులారా!!!...//రండి రండి//
ఉప్పెనలా ఉద్యమంలో ముందుకు దండిగా చేరండి! ఉద్యమ ఆసామీలా!! భాగస్వామ్యలై కదలిరండి!!! కొత్తగా పొందడంకోసం కానేకాదు ఉన్నది ఊడక కాపాడే ఆరాటం!
హక్కులను నిలబెట్టుకునే పోరాటం!! //రండి.. రండి....//
పతనం అవుతున్న జీవన ప్రమాణాలను ఒడిసి పట్టి, సిపియస్ సాధనకోసమే!ఇచ్చిన హామీలను రాబట్టడంకోసం, లబ్దిపొందే పిఆర్సీ కోసమే ఈ సమరం! ఉద్యోగ సమరం!!
అందుకే సమస్త వేతన జీవులారా! వెతలు తీరుటకోసం అన్నివదలి కదలిరండి!! ..//రండి...రండి..//
మీ అందరి అండదండలే ఉద్యమ విజయకేతానికి సంకేతం!! మీ కాళ్ళకదిలికలే
పోరుబాటై మన జయానికి విజయ బావుటా అందుకే వరదలా ఉప్పొంగి పోరాటం చేద్దాం పోరాడితే పోయేది ఏముందిరా! శ్రమజీవుల సంకెళ్లు తప్ప!!//రండి.. రండి..//
పోరుబాటలో నడుము బిగించి నడిచి మభ్యపెట్టె ప్రభువుల భ్రమలు తొలగించి మన బతుకు సట్టుబండలు కాకుండా చేసుకుందాం రండి!రండి రారండి//రండి.. రండి...రారండి.....///
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి