లే లే!! ఇకనైనా లేవయ్యా! ఇంకెంత కాలం ఎదురు చూస్తావూ!
చూసిచూసి కళ్ళుబైర్లు కమ్మే నివేదిక బయటకు వచ్చింది, ఒళ్ళు జలదరించే/జలదరించు రిపోర్ట్ వచ్చింది, గుండెపోటు వచ్చే సన్నివేశం వచ్చింది!!
ఇకనైనా! ఇప్పటికైనా! ఆవేశం రాకపోతే? ఎలా??
ఆహా!ఓహో!! అన్నది చాలు కొంప కొల్లేరు అవుతుంటే; కడుపు చెరువు అవుతుంటే! కన్నీరు ఇంకిపోతుంటే; మైండ్ బ్లాక్ అవుతుంటే; గుండె బద్దలు అయిపోతుంటే!!
ఇంకా సన్నాయి నొక్కులుతుంటే; నెత్తిన మొలకలు రాలిపోతుంటే!
నీ అభిమానం రచ్చబండకాను; ఆపవయ్యా!
నీ బుద్ధి మార్చుకుని లేవయ్యా!!
లె!లేలే!! ఆవేదన పెడుతున్నా పట్టనట్లు ఉంటే రేపటి నీ బతుకు చీకటి !
అందుకే ఇప్పటిదాకా చూసిందిచాలు,ఇకనైనా ఏదైనా చేయడానికి రా!రారా!! కదలిరా!!
ఇప్పటికీ నీకు చేయడానికి రాకపోతే ?చేసేవారితో కలువు చేయూత ఇవ్వు!!
అదే నీకు నీవు ఇచ్చుకునే బలం! అదే వారికి నీవు అందించే మహాబలం!
ఉద్యోగ ఉద్యమానికి సంజీవిని, వేతనజీవుల మనుగడకు అమృతవర్షణిలా మారు! కదలవయ్యా ఓ ఆలోచనలో పడ్డ ఓ ఆంధ్ర ఉద్యోగి! !
అది నీ హక్కుల పోరాటం! నీకు ఇచ్చిన హామీల సాధనలో పొందే నీవు పడే ఆరాటమే ఈ నిరసనల గళం!!!
లే! లేలే!!! రా! రారా!!
కదం తొక్కుతూ! గళం విప్పుతూ,కరం తిప్పుతూ కదలవయ్యా! కదులు నీ కదలిక ఈ ఉద్యమానికి వేవేల గజాల బలం కావాలయ్యా ఓ సగటు ఉద్యోగి
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.