పాలబుగ్గల పసిడి దానా
లేత గులాబీ చిన్నదానా
పండు వెన్నెల్లో మెరిసే దానా / పాల బుగ్గల../
చూడచక్కని మోము గలదానా
నీ అందం చూడ తరమా
నిన్ను చూసాక కన్ను రెప్ప వాల్చగలనా
నిన్ను వదలి ఉండగలనా
చెప్పవే చిన్న దాన
చిలిపి నవ్వుల ఇంద్రలోకపు గులాబీ పువ్వా
నా అనంత అంతఃపుర మదిలో ఒదిగి దాగే గువ్వా/పాల బుగ్గల../
కటిక చీకట్లో కానవచ్చే పటక కాంతి లయమా/పుంజమా
యద గూటిలో మెదిలే ప్రేమ తరంగమా
నీ రాక నా కోసమే ఇక యాడికి పోమాకే
నా మనస్సు దోచిన నా దొరసాని
అవనిలో నిలిచి నన్ను ఏలుకోనీయవే ఆమని/పాలబుగ్గుల../
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.