మకర సంక్రాంతి / కనుమ శుభాకాంక్షలు...మీ చురకశ్రీ
########################
ఏడాది పొడుగునా జీడిపప్పు,బాదం,పిస్తాలతో నన్ను మేపి;
మేలిమిగా తీర్చి ఈతలో కూతలో వేసే అడుగులో కొట్టే కోతలో తర్ఫీదు ఇచ్చి
కంటికి రెప్పలా ఒంటికి అంటిపెట్టుకుని!!
నా స్వరం కొక్కురోకో వింటే సంబరాలు చేసుకుంటూ, మెచ్చుకుంటూ ఉంటే తెగ సంబరాలు నాలో నేను!!
సంక్రాంతి సంబరాల కత్తి కట్టి నన్ను వదిలి
నేను కొక్కురోకో అంటూ బరిలోకి దిగి పిలిచి పిలిచి కూత కూతకు కొట్టుడు కొడుతూ ఉంటే!
ఈలల గోలలు చేస్తూ మీసాలు మేలివేస్తూ సంబరాలు చేస్తూ పందేలు కాస్తు!!
ఊరు వాడా ఒకటి చేస్తూ నీ అంత మొనగాడు లేడని, రాడని గడిబిడి రగడ చేస్తూ!
ఓడితే నా ముఖం వంక జాలిగా చూడక ఛీ!ఛీఛీ!! అంటూ పోతున్నా;
అప్పుడు కూడ తన వంక చూస్తూ నా కూత కొక్కురోకో!
గెలిస్తే!! ఊరంత ఊరేగింపు చేసినప్పుడు నా కూత కొక్కురోకో!! యే!!!
కనుమ నాడు కనీసం కనికరం లేక ఒకే ఒక వేటుతో కోత వేసేటప్పుడు కూడా నా కూత కొక్కురోకో! యే!!
ఇసుమంత మమత మమకారం లేక కూరగా కారం పెట్టుట ఏమాత్రం న్యాయమా? ధర్మమా??
ఎప్పుడు కూడా నా కూత కొక్కురోకో!
నా కూత ఎప్పుడు ఘనమే మేలుకొలుపుయే!!!అదే కొక్కురోకో!!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.