మామ మామా నా బంగారు మామ!!
మామ మామ ఓ నా మాయదారి కిలాడి మామ!!!
నీవు కొట్టిన తిట్టిన నెట్టిన
నిను చేపట్టేదాక వదలిపెట్ట నీతోనే తాళిబొట్టు కట్టించుకుంటా మామో ,/మామ మామ.../
నా మనసులో నిండిపోయావు,
నా వయస్సుకు సరిజోడివి నువ్వే!
నువ్వు ముద్దుఎట్టక పోయిన
ఎంతకాలమైనా ఎప్పటికైనా తగ్గేదేలా మావో! భళెభళే!! మామో!!/ మామ మామ.../
నీ వెంట నడిచే దాకా కాపు కాస్తా
నీవు మొట్టికాయ కొట్టిన మట్టికాయలు తింటూనే నా మెట్టినిల్లు నీ మేడ కడకు నీడ అయ్యే దాక
నీ బిగి కౌగిలి కోసం వేచి ఉంటా నీవు ఊహు! అన్నా నీ చేత ఊ! అనేదాక ఆగి ఉంటా ఓ చిన్నోడా
నా మనస్సు నచ్చినోడా నా పసందైన మామో!! / మామ మామ..../
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.