అరెఅరే సమస్యలు ఎన్నిఉన్న ముఖాన చూపక
అరె అరే నవ్వుతూ, నవ్విస్తూ సందడి సందడిగా హడావుడిగా
ఊరువాడ చల్ చల్
రంగు రంగుల అందాల చీరలు కట్టి ముత్తైదువులు
అద్దాల పరిగణిలు కట్టి పడుచులు ముచ్చట్లు పడుతూ బొమ్మబొమ్మల వస్త్రధారణల ఆడిపాడే పసిడి పిల్లలు కేరింతలు!
పసిడి రంగు పులిమిన బంగరు బాణాలు నెత్తిన పెట్టి తళతళలాడే ఆభరణాలు ధరించే ధరణి రాణులు!!
రంగు రంగులపూలు ఆకులు చుట్టిన బోనాలు ఎత్తిన అతివలు!!
భక్తితో నడిచే స్త్రీ సమూహాలు చేసే సందళ్ళు పెట్టేది సద్ది పొంగళ్ళు!! కోలాహలాలు తీసుకొనే తీర్ధప్రసాద జలాలు అమృతఫలాలు!!!
పంచుకునే ఆత్మీయ అనురాగాలు!!
ఒక్కొక్కరి అనుబంధాల లయకారాలు!!!
ఈ తిరునాళ్ళు సందడుళ్ళు
గంగమ్మజాతరైన పోలేరమ్మ పొంగళ్ళ యాత్రైన! అంకాలమ్మ, తిరుపతమ్మ, చెంగాళమ్మ ,కళుగోళమ్మ జాతరలైన!
ఏ అమ్మ పొంగళ్ళైన!! ఒకటే,
కోరికలు శ్రద్ధ ఒకటే,
భక్తిమార్గం ఒకటే,
ముక్తి పొందే ఒకటే!
చల్లగా చూడమని
,నిబ్బర శక్తి ఇవ్వమని! ఆయుఃఐశ్వర్య సుఖఃశాంతులు ఇవ్వమని!! ఉత్సాహంతో ఊరువాడ జరిపే ఉత్సవాల పరంపరలే!!ఈ మహా జాతరలు జాతిని ఏకం చేసే విజయయాత్రలే...!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ )కావలి.