బలం ఉన్న మన వారు ఎందుకో వెనుకబడ్డారు
బలగాలు ఉన్న మన వారు ఎందుకో మెత్తబడ్డారు
సంఘాలు ఉన్న మనవాళ్ళు ఎందుకో వెనుకబడ్డారు
సంఘటిత శక్తి ఉన్న మనవాళ్ళు ఎందుకో వెనుకబడ్డారు
నమ్ముకున్న సభ్యులు ఉన్న మనవాళ్ళు వెనుకబడ్డారు
ఎదురు నిలిచి పోరాడే శక్తి ఉన్న నలతతో కాడి వదలి మనవాళ్ళు వెనుకబడ్డారు
దమ్ము చూపే దైర్యం ఉన్న కలతతో మనవాళ్ళు వెనుకబడ్డారు
పోరాట పటిమ ఉన్న మగతతో వెన్ను చూపి మనవాళ్ళు వెనుకబడ్డారు
ఉద్యమాలు ఊపిరి గల మనవాళ్ళు ఏదో ఊబిలో పడి ఎందుకో వెనుకబడ్డారు
ఉత్సాహంతో ఉరకలు వేసేవారు ఏదో లాబిలో చిక్కి మనవాళ్ళు వెనుకబడ్డారు
ఆశయసాధనలో ముందుండే మనవాళ్ళు దేనికో నీరస పడ్డారు
న్యాయం కోసం నిలిచే తెగువ ఉన్న మనవాళ్ళు ఎందుకో అణిగిపోయారు
హక్కుల కొరకు అరిచే నోళ్ళు వచ్చిన ఇచ్చిన దాంతో నీళ్ళు నమిలి సద్దుమణిగాయి
ఎందుకో, దేనికో మనవాళ్ళు వెనుకబడ్డారు
విసిగిపోయారో,బేజారు అయ్యారో,అలసిపోయారో ఎందుకో ఆగిపోయారు
తిరగబడలేకనో సమయం కాదు అనో ఎందుకో మనవాళ్ళు వెనుకబడ్డారు దేనికో మెత్తబడ్డారు, నష్ట పరిచారు ....
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.