ఎందుకో! ఎందుకో!!
ఎలుగెత్తి చాటే గళం నిస్సారం
పిడికిలి బిగించే కరం నరాల పట్టు సడలింది!
చైతన్యపు కలం సచ్చుపడింది
జతకలిసే చేతుల ఐక్యత సన్నగిల్లింది!!
పరుగెత్తే కాళ్ళు వంకరలు తిరిగాయి
ఎర్రబడే కళ్ళకు గంతలు పడ్డాయి!
గుండెలో పారే ఎర్రని కణాలు సల్లబడ్డాయి!!
అల్లంత దూరానా బతుకు వల్లకాడు కనిపిస్తున్న
శరీరాన నీరసం, నిస్సత్తువ, వణుకు తాండవం చేస్తుంది!!
అవే ఉషోదయ కిరణాలు
అలాంటి రోజులే
అవే గంటలు
అవే సమస్యలు, అలాంటివే పరిస్థితులు!
పిరికితనం
అయిన భయం భయం గుంభనం!!
నవోదయానికి నాంది ఎప్పుడు కలుగు;
శుభోదయ శంఖానికి పునాది ఎప్పుడు జరుగు!!
అరుణోదయ కాంతులు ఎలా ప్రసరించు!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి