నే మనస్సు విప్పిచేప్పేలోపే; నీవేమో నన్ను లాగేసుకుని వడిసిపట్టి ముద్దెట్టేసుకొని పోతివి కదా ప్రియా!
నాపై అంత ప్రేముందని ముందెన్నడూ తెలుసుకోలేకపోయా!!
నే నీ చేరువలో ఉన్నా,చనువుగా వున్నా
నేను చేయలేని తెగింపు నీవే చేశావు!
నేను ఆ క్షణం ఒక శిలగా నిలబడిపోయా!!
తక్షణమే నా గుండె జలదరించి గల్లంతు అయింది ప్రియతమా!!
నా తనువు చలించి చల్లగా అయి పోయింది;
నే మెల్లగా తేరుకొని హత్తుకున్న నీ తనువుతో అణువణువు వేడిగా మారింది ప్రియా!!
నా చేతుల వణుకు బెణుకు చెల్లాచెదురు అయింది!
నా మనసు పులకరించి నిన్నే పలకరించే ప్రియా!!
నా అంతరంగ మదిలో ప్రేమనది అనంత మధురిమలతో మృదువుగా మెదిలింది;
నిండైన తరంగంలా ప్రియతమా!
ప్రేమంటే/ప్రేమన్నది అదే కాబోలు!! ఎవరోఒకరు వేయాలి ముందడుగు నీలా!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్(చురకశ్రీ) కావలి.