నాకేమి కొత్త కాదు
అలాగే నీకు కూడా కొత్తేమీ అంతకంటే కానేకాదు
బాధలు భరించడం;
సమస్యల్లో ఉండడం;
వాటిని ఎదుర్కోవడం పరిష్క
రించుకోవడం! ఎందుకంటే ;
అవి ఎల్లప్పుడూ మనవెంటే అంటుకొని ఉండేవే!
వాటితోనే మన నిత్య సావాసం!!
కష్టాలు అనుభవించడం; కన్నీరు కంటిలో దాచుకోవడం; వాటిని కంటి లోనే ఇంకింపచేయడం!
ఎందుకంటే అవికూడా విలువే!! మరి;
ఇతరుల కంట పడనీయక చూసుకోవడం;
కొత్తేమి కాదు మనకు
చులకన అయితే అదొక బెంగ మనకే మరి!
బాధలు పడుతున్న కష్టాలు అనుభవిస్తున్న;
తీరా! తీరిపోయాక;
మనసుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు!
సుఖం అనేది కలిగించే హాయి కాస్తే;
అయినా!!
దాని కోసంపడే తపన,ఆరాటం,పోరాటం ఎంతో!!
పొందినాక;
బొందిలో కదలిక ఆనందపు డోలిక!!
అవధులు లేని అనంత సరాగాలు!
ఇవన్నీ;
నీలో నాలో నిరంతరం సాగే జీవన సరాగాలే!!
అందుకే ఇవన్నీ నాకు నీకు కొత్తేమీ కాదు!
అదే జీవితం అందులోనే జీవనపు మకరందం;
సాఫీగా సాగితే దేని విలువ తెలియదు సుమా!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్(చురకశ్రీ) కావలి