నిన్ను నువ్వు మలచుకోరా! ఓ.. పసికూనా!! నీ బతుకు జాతరకు బలి కాకుండా మహాయాత్రగా చక్కదిద్దడానికి చదువు ఒకటే సాధనం రా!!! / నిన్ను.../
సాధన చేస్తే అది నీ చేతికి ఆయుధమేరా!అన్ని విజయాలు పొందడానికి వజ్రాయుధమేరా!! నీ జ్ఞానమే దానికి మూలం అయ్యేనురా!! / నిన్ను.../
ఇంధనం, ధనం తరిగిపోవచ్చు నురా;బంధుగణం తరలిపోవచ్చునురా! దాచుకున్నది దోపిడీ కావచ్చునురా!
నీలో దూరిన చదువు నిన్ను దాటిపోలేదురా!!
అది నీలో ప్రాణం ఉన్నంత వరకు అంతం కాలేదురా నీతోనే తరతరాలుగా ప్రయాణించునురా/ నిన్ను.../ జీవనదులై,మహా సాగరాలైన ఇంకిపోవచ్చునురా!
నీలోన నిలిచిన విద్య ఎన్నటికీ ఇంకి పోలేదులేరా!!
హద్దులు దాటి ఖండాంతరాలు పయనించునురా! నీకీర్తి, నీజాతి కీర్తి కలకాలం నిలిచేనురా!! / నిన్ను../
అందుకే నీవు చదవాలిరా! చదువు విలువ తెలుసుకోవాలిరా!! తెలుసుకుంటూ ఎదగాలిరా!!!/.నిన్ను../
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.