"బాలగేయం"
ముత్యమంత తెల్లనైన మనసు బాలలు !
వెన్నెలంత స్వచ్ఛమైన
వెలుగు బాలలు !!
విరిసే పువ్వు వంటివారు బాలలు !
మెరిసే నవ్వు వంటివారు బాలలు !!
కురిసేచినుకు వంటివారు బాలలు !
కన్నులలో కాంతి నింపు
వారు బాలలు !!
చిరునవ్వుకు చిరునామా
చిట్టి బాలలు !
తెలుగుజాతి దివ్యభవిత
ఘనులు బాలలు !!
స్వీయరచన: 6.9.2022.
శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి
హైదరాబాద్.