ఉషాకిరణాలు🤍🌹
మనదియైనదేది మహిపైనయనిచూడ
మనముచేయు సేవె మనదియౌను
మంచిపనులవలనెమన్ననలభియించు
భావిపౌరులార బాలలార
ఆశకాదు జూడ అత్యాశయౌ తప్పు
కోర్కెకాదు జూడ కొరత తప్పు
ధనముకాదుజూడ ధనకాంక్షయౌతప్పు
బలముకాదు జూడ బలుపు తప్పు
🤍🌹🤍
అన్నలూరు ఉమామహేశ్వరరావు,
ఇస్కదామెర్ల... నెల్లూరు