తొలి సంధ్య
----------------
తెల తెల వారెను తొలి సంధ్య నేడు
కొత్త కాంతుల కొసరి కిరణాల మేడ
మధుర భావనలమందార తోట
కొత్త ఆశల జీవన శోభలు కదలాడ
బంగారు కాంతుల బంధాలు వేసి
బడలికలు తోసేసి బలషాలిగజేసి
కర్తవ్య తీరాలు కనులముందుంచి
కార్య దీక్షకు కదలి కలిసి రమ్మనుచు
సమయపాలన జేసి వచ్చె సంధ్య
దేదీప్యమానంగ వెలుగు సంధ్య
అక్షర సత్యము ఆదిత్య చెంత
పతిదారి నడిచేటి పత్ని ఈ సంధ్య
💐💐💐🌹🌹🌹🌸🌸🌸
కుసునూరు భద్రయ్య, మెకానిక్ ఆర్టీసీ, హైదరాబాద్