నేటి పంచపది 309
తేది:10.09.2022
అంశం:ఆత్మహత్య నివారణా దినోత్సవం
పేరు: పోరంకి నాగరాజు
మీ పంచపదుల సంఖ్య:789
అమ్మానాన్నల విలువ తెలుసుకో
విలువైన జీవితం ముందుందను కో
నీ జీవిత గమనం గమ్యం మార్చుకో
జీవితాన్ని విజయం వైపు మలుచుకో
ఆత్మ హత్యల ఊసే ఎత్తకు గోపాల!
790)
దైవము పై నమ్మకము విశ్వాసం ఉంచాలి
పెద్దలు, గురువుల మాట ను లక్ష్య పెట్టాలి
చెడు మాట, చెడు నడతను విడనాడాలి
ఆత్మ హత్యను మహాపాపం గా భావించాలి
లక్ష్య సాధనలో ముందుకు పోవాలి గోపాల