బాల సాహిత్యం
(బాలగేయం)
మ-మా-మి-మీ-ము-మూమృ-మె-మే-మై-మొ-మో-మౌమం*
----------------
శీర్షిక:. "జాబిల్లి "
మబ్బులచాటున జాబిల్లి
మాయామర్మంతెలియనితల్లి
మిలమిలమెరిసేతారలతో
మీగడతరకలమెరుపులతో
ముద్దుగ నవ్వెను జాబిల్లి
మూలము వెన్నెలజాబిల్లి.
మృదువుగతోచెనుజాబిల్లి
మెరుపులనవ్వులజాబిల్లి
మేఘాలలోతేలిఆడినది
మైమరపించే అందమది
మొయిలుచాటునదాగుంది
మోముదాచిననుచూసింది
మౌనమునేమాట్లాడించింది
మంచిగ పకపకనవ్వింది!!
********
మబ్బులచాటున జాబిల్లి!
మాయామర్మంతెలియని
తల్లి.!!
స్వీయరచన:✍️
శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి
హైదరాబాద్.