తేదీ. 7-9-2022
పూలతో ప్రకృతి
*****
1.
పూలపై వాలెడి తుంటరి తుమ్మెదలు
చక్కని సీతాకోకచిలుకలు ఇంక ఎన్నో
పూలలోని పరిమళ మధువు కొరకు
ఈ మధువు సేవనం వాటికెంతో తృప్తి.
2.
పూలలోని మధువును గ్రోలెడి
కీటకములు, ఇతర చిన్న పక్షులు
ఎంతటి అదృష్టమొ ఈ జీవులకు.
హాయిగా బ్రతుకుతు తిరిగెడివవి.
3.
వాటి ప్రణయ శృంగార క్రీడలను
ఎవరో చూస్తున్నాన్న పట్టింపు లేదు.
ప్రణయ శృంగార క్రీడలను హాయిగా
జరుపుకునెడి పునరుత్పత్తి క్రియలవి.
4.
సృష్టి పరంపరలో ఇదొక తంతు.
తన్మయ శృంగార క్రీడా కేళులవి.
నిరంతరము కొనసాగుతూ జరిగెడ
సంతాన పునరుత్పత్తి ప్రక్రియ అది.
5.
జయహో పుష్ప వికాస విలాసమ !
జయ జయహో కీటక పక్షుల కేళీ !
జయహో ప్రకృతి సృష్టి పరంపర !
జయ జయహో అందమ ! ఆనందమ !
6.
ఏ సంపదలు, నివాస భవనములు
అవసరమసలే లేవహొ వాటికి !
మొక్కలు, చెట్లు, వృక్షములు,
అకసమే అవ్వాటి నివాసము !
7.
ఎన్నో రకాల రంగులు పూలకు !
అహొ ! భంగిమ లెన్నో పూలకు !
ఎంతొ పరిమళము పూలకు !
ఎంతో ఆకర్షణ యీ పూలకు !
8.
మొక్కలకు ఎన్ని పూలుంటే
అంతటి అహ ఆకర్షణ వాటికి !
ఆ పూవుల రంగు సువాసన
వలెనె జనానికి అహో సంబరం !
9.
ప్రకృతి ఎంతో అందం
ఈ పూల వలననే !
సందర్శకుల ప్రకృతి దర్శనం
పూల వలననే !
మనసుకు ఎంతో ఆనందం
ఈ పూల రంగుల వలననే !
మన తనువుకు ఎంతో హాయీ
ఈ పూల పరిమళమున !
10.
ఓ మనిషీ ! నీవు సహితం
ఆస్వాదించగ రావచ్చూ !
పూల మొక్కల అందం
సందర్శించగ రావచ్చూ !
11.
అపుడే కద మన మనసుకు హాయీ!
అనుభవమ్ము అలా అగునోయీ !
రమ్మని రమ్మని పిలిచే ఆమని
ప్రకృతి స్వాగత తోరణములవీ !
******
రచన:--రుద్ర మాణిక్యం (✍️ కవి రత్న)
జగిత్యాల