మానవ జన్మ శ్రేష్టము
------------------------------
జీవితమే యుద్ధం
పోరాడిన విజయం
సమస్యలు ఎదురింప
ఉండాలోయ్! సిద్ధం
మనిషి జన్మ శ్రేష్టము
సృష్టిలో అద్భుతము
కష్టపడిన ఫలితము
చేసుకొనుము ధన్యము
పూయలోయ్! నగవులు
గెలవాలోయ్! మనసులు
ప్రేమను వెదజల్లిన
వర్ధిల్లును బ్రతుకులు
పిరికితనం వీడుము
ధైర్యంగా ఉండుము
ప్రశస్త్యమైన జన్మను
చేసుకోకు వ్యర్ధము
-గద్వాల సోమన్న