నలుగురితో ఉండాలి!
------------------------------
పూవులోని తావిలా
నగవులోని సొగసులా
నలుగురితో ఉండాలి!
దండలో దారంలా
దివ్వెలోని వెలుగులా
మువ్వలోని నాదంలా
నలుగురితో ఉండాలి!
బువ్వలోని సారంలా
మెడలోని హారంలా
మడిలోని పైరులా
నలుగురితో ఉండాలి!
గుడిలోని దైవంలా
ఒడిలోని పాపల్లా
బడిలోని గురువుల్లా
నలుగురితో ఉండాలి!
సడిలేని నడిరేయిలా
-గద్వాల సోమన్న