గుండె ధైర్యం విజయం
------------------------------
ధైర్యంగా ఎదగాలి
జీవితాన్ని గెలవాలి
సమస్యలను ఎదుర్కొని
స్ఫూర్తిగా నిలబడాలి
చురుకుతనం చూపాలి
నిబ్బరాన్ని చాటాలి
గుండె ధైర్యం నింపుకొని
పిరికితనం తరమాలి
మానసిక ఒత్తిడిని
ఆదిలోనే త్రుంచాలి
నిద్రాణమైన మదిని
తక్షణమే లేపాలి
మనోధైర్యముంటేనే
జీవితంలో విజయం
పిరికితనం జీవితాన్ని
చేస్తుందోయ్! విలయం
-గద్వాల సోమన్న .