తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలతో💐💐
ఆ.వె
జనులు బల్కు భాష జన పదమే యాస
జాన పదుల నోట జాలు వార!!!
గలగల తెలగాణ గాంభీర్యమొలకగా
ధీర చరితలున్న తెలుగు దొడ్డ!!
యాసన తెలగాణ నలవోకగా నుండు
మాటన తెలగాణ మంచి తనము!!
తెగువ గల్ల గడ్డ ధీర తెలగాణయే
భాషనమన యాస బహుళ ప్రీతి!!
పల్లె పడుచు నోట బతుకమ్మ పాటాయె
ఒగ్గుకథలు విన్న హృద్య మాయె!!
ధగధగలాడి దాశరథి కలాన
కోటి వెలుగు లీనె గొప్ప గాను!!
అవ్వఅయ్య నన్న నాత్మ గల్ల పిలుపు
అన్య భాష లందు నంద బోదు!!
కాళుని కవనాన గర్జించినా భాష
మనది తెలగాణ మాతృ భాష!!
చిగుర్ల రామలక్ష్మి