కాళోజీ!
వేదనమే వేదము
నాదమే నినాదము
తొలగాలి ఖేదము
ఓ వెన్నెలమ్మ
అవకతవకలుఁజూసి
కవితనమ్ముగ చేసి
వదిలెనూ గరిచూసి
ఓ వెన్నెలమ్మ
నైజాముకెదిరేగి
అగ్గిరవ్వయి రేగి
కాళోజియే యోగి
ఓ వెన్నెలమ్మ
పలుకుబడులా బాస
అవ్వనేర్పిన యాస
ప్రజలకై మీ శ్వాస
ఓ వెన్నెలమ్మ
బాధలకు స్పందించి
కవితలను సంధించి
పోరాడ కలమెంచి
ఓ వెన్నెలమ్మ
కాళోజి నాగొడవ
ప్రజల వ్యథలాకడవ
కడలి దాటే పడవ
ఓ వెన్నెలమ్మ.
✍️సంపత్ రాజ్!
కాళోజీ జయంతి శుభాకాంక్షల తో