ఉండాలి అందరూ!
------------------------------
ఆకసాన తారలా
తీయనైన ధారలా
ఉండాలి అందరూ!
ప్రమిదలోని కాంతిలా
తరువులోని త్యాగంలా
గురువులోని జ్ఞానంలా
ఉండాలి అందరూ!
వెలుగులీను భానునిలా
చెరువులోని జలంలా
కలంలోని బలంలా
ఉండాలి అందరూ!
చెలిమిలోని ఫలంలా
గాలిలోని శక్తిలా
భక్తిలోని ముక్తిలా
ఉండాలి అందరూ!
అమ్మలోని ప్రేమలా
-గద్వాల సోమన్న .