జయహో జయహో వీర జవాన్
జయ జయజయహో వీర జవాన్
సరిహద్దుల్లో సైన్యమా
భారత రక్షణ కవచమా
శత్రు గుండెల్లో సింహమా
భరతమాత వీరతిలకమా//జయ//
వెన్నుచూపని వీరుడా
ముందుకు నడిచే ధీరుడా
సాహసించే శూరుడా
వెలుగునిచ్చే సూర్యుడా//జయ//
మంచు కొండల్లో కంచుకోటవి
కారడవుల్లో కాంతిరేఖవి
నీటిలో తిరిగే తిమింగళానివి
గాలిలో ఎగిరే ఉక్కు పక్షివి// జయ//
దేశం కోసం ఆరాటం
అలుపెరగని నీపోరాటం
ఓ వీర జవాన్ నీకు సలాం
అమర జవాన్ నీకు సలాం
రచన. సుగుణ మద్ది రెడ్డి
ఐలవారిపల్లె
ఐరాల