527)
బాల పంచపది
పి.నాగరాజు 9-9-2022
వర్షం
మిల మిల మెరుపులు మెరిసెను
జడి జడిగ వానలు కురిసెను
చెరువులు కళ కళ లాడెను
పైరులు పచ్చగా తళ తళ లాడెను
రైతుల మోములు మురిసెను గోపాల!
528)
ముద్దు బిడ్డలు
భరతమాత ముద్దు బిడ్డలము
అమ్మానాన్నల మురిపాలము
కొమ్మకు పూచిన రెమ్మలము
అమాయకపు పసి పాపలము
దేశానికి కాబోయే వారసులము గోపాల!
చెట్లు
529)
చెట్లు చల్లని నీడ నిచ్చును బాలలు
ప్రాణవాయువు నిచ్చును బాలలు
పూలు కాయలను ఇచ్చును బాలలు
పక్షులకు గూడు నిచ్చును బాలలు
తరువులే గురువులు మనకు గోపాల!
పోరంకి నాగరాజు (యస్.ఏ) హిందీ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కామవరపుకోట
నా కలం పేరు గోపాల