తెలంగాణ సాహిత్య కళావేదిక
అంతర్జాల సమావేశములో వినిపించుటకు
ప్రక్రియ: వచన కవిత
తేది: 9-9-2022
పేరు: జోషి మధుసూదన శర్మ
నం.9676367317
శీర్షిక:"మన బాస తెలంగాణ బాస"
తెలంగాణ యాసల
మాట్లాడ్తెనె మంచిది!
తెలంగాణ యాసల
రాస్తెనె బాగుంటది!
బళ్ళ పిల్లగాల్లకు
పిల్లలకు సదువు
తెల్సిన మాటల్ల
తెల్సిన బాసల
జెప్తె అర్థమైతది
నెత్తికెక్కుతది
ఇంట్ల ముచ్చట్లువెట్టె
పల్లెల్ల ముచ్చట్లువెట్టె
బాసల్ల పాఠాలు జెప్తెనే
అర్థమైతది గద మల్ల!
గిప్పుడేమొ అందరు
ఇంగిలీసుల సదువంటరు
మా తెలంగాణ రాజ్యంల
మా పోరడు ఇంటికొచ్చి
సదువుతుంటె
మాకైతే ఏమి అర్థంపర్థం తెలుస్తలేదు! ఏడ్సుతున్నట్లే
ఉంటది!ఎంత సద్వినగాని!
ఏం జేయ్యాలె మేము
గీ సదువులను జద్వి
ఎక్కడని వోవాలె
ఎర్కగాందే సద్వి
మన యాస బాసలోనే
మాట్లాడితేనె మంచిదంట!
తెలంగాణ యాసలనే
కైత రాస్తె బాగుంటదంట!
పుస్తకంల పాఠాలు మీద
ఇంగిలీసంట
కిందనేమొ తెలుగంట
మా పిల్లగాండ్ల పుస్తకంల
ఏం జెప్తున్నరో తెలుస్తలేదు
ఏం జదువుతున్నరో
అసల్కే తెలుస్తలేదు!
ఏమై పోవాలె
మా పిల్లలు
ఎక్కడ్కి తీస్కవోతరో
గీ పన్కి రాని సద్వులు
జదివించి!
పెద్దలెందరో జెప్పిరి
మనబాసల ముందు
నేర్సుకొని పరబాసలు
నేర్సమని! మా తాతలు
జెప్పిరి!మా యవ్వలు
జెప్పిరి! మరేమో!
మా యమ్మ నాయనాలేమో
మా నాయకులేమో
ఇంగిలీసే ముద్దు అనవట్టిరి
బలవంతంగ రుద్దవట్రి కదా!
ఎందుకైన మంచిది
మనబాసలనే సదువుదం
మన బాసను కాపాడ్కుందం!
జై తెలంగాణ! జై తెలంగాణ బాస!
ఇదే నా శ్వాస! తెల్గు మీదనే నా ఆశ!
( గీ నా కైత నా తెలంగాణ
బాస దినమునము కొరకు
రాసినదని నా సొంత కైత
అని హామి రాత రాసి ఇస్తున్నాను )🌹🙏🌹
అందరికి శుభాలు
గల్గాలని కోర్కె
తెల్పుకుంట!🌹🌹
పూజ్యులు శ్రీ యుతులు కాళోజీ గారి జయంతిని పురస్కరించుకొని నేను వినిపించే కవిత 🙏