నా కవితల అలిపిరి
*******
కాళోజీ జయంతి రోజున నేను
వినిపించిన కవిత.
శీర్షిక - కాళోజీ ! నీకివే నా అసలైన నివాళులోజీ !
""""""""""""""""""""""""""""""
భాషల పలుకు బడుల యాసలు ఎన్నో !
అందు తెలంగాణ తెలుగు యాస ఒకటి !
తెలంగాణ తెలుగు యాసల నిపుణ ఝరి
ప్రజా కవి కాళోజీ కవనము !
ఆయన మనసును ఆకళింపు చేసుకుని
చేయవలెను మరి మరి స్మరణము !
నా గొడవ అంటూ తెలుగు కవనమును
ఎటో తీసుకెళ్ళాడు !
ఎందరికో పరిచయం చేస్తూ !
ఎందరి నోళ్ళలో మనుషులలో అవి
నాటుకొని
పెనవేసి కొని ఉన్నవో కద ! ఓ కాళోజీ !
నీకివె అసలైన నివాళులోజీ !
ధన్యోస్మి యని తరింతును !
తెలుగు కవనమును ఆవాహనము
చేసుకొందు వీలైన వేళలలో !
వెల్లడి చేయుచు తెలుగు కవనమును
ఆయా జాడలలో !
ఇది నా కవనపు శ్వాస ఊపిరి !
ఎదను తట్టి లేపెడి కవితల అలిపిరి !
కవితల అలిపిరి !
*******
రచన :--రుద్ర మాణిక్యం (✍️కవి రత్న) జగిత్యాల