ఒత్తిడిని జయించు
------------------------------
ఒత్తిడినే శాసించు
శాంతంగా జీవించు
సమస్యకు పరిష్కారం
ఉంటుందని గ్రహించు
పెద్దలతో చర్చించు
సమస్యలు అధిగమించు
శ్రేష్టమైన జీవితము
కాకూడదు వ్యర్థము
ఇల ఆత్మస్థైర్యంతో
మున్ముందుకు సాగాలోయ్!
మహనీయుల దారిలో
మంచిగా నడవాలోయ్
ఆత్మహత్య ఆలోచన
ఆదిలోన త్రుంచాలి
మనోనిబ్బరం కలిగి
గొప్పగా జీవించాలి
-గద్వాల సోమన్న