తిరువాయిపేట లక్ష్మయ్య
చరవాణి:-9704038892
శీర్షిక:-చంద్రుని కళ
చంద్రుని వెన్నెల తెల్లన
చంద్రుని వెన్నెల చల్లన
చంద్రుని చూడగ ముచ్చటగా
చంద్రుని వెన్నెల హాయిన
చంద్రుని రూపు గుండ్రన
చంద్రుని అందం చందన
చంద్రుని అందం చూడగ
చంద్రుడు పున్నమిన కనబడగ
చంద్రుడు వెన్నెల కురిపించగ.
పిల్లవానికి అమ్మ అన్నం తినిపించగా
అదిగో చంద్రుడు చూడనగా.
చంద్రుడు కావాలని మారాం చేయగ
చంద్రుడు అందక ఏడ్వగ.
పిల్లవాడికి చూపింతురు అద్దమున.
పిల్లవాడు ఆరగించును సంతసమున