పుస్తకం ! చక్కని పుస్తకం !
మస్తిష్కానికి ఇదొక సుకర నేస్తం !
ఈ పుస్తకం మన హస్త భూషణం !
అందుకె పుస్తక పఠనమును
చేసుకొనుము శాసనం !
మన మస్తిష్కంలోని
జ్ఞానం విజ్ఞానమ్మును
అవసరమైనపుడు మనకవసర
జ్ఞానమును అందజేసేదే పుస్తకం !
అది దైవం గురించియో
సుర ముని గుణముల గురించియో
సాంకేతిక రంగమున ఆవిష్కరణల
విజ్ఞానము గురించియో,
మన మనుగడ గురించి, తద్వారా
దేశము, దేశ సుగతి ప్రగతి గురించియో,
చట్టము, చట్ట నియమ
నిబంధనల గురించియో
ఇతరత్ర ఎన్నో విషయములను
పదిల పరిచి అందిస్తుంది పుస్తకం !
ఇదీ అసలు పుస్తక లక్షణం !
దీని వలనే మన జ్ఞాన సంరక్షణం.
దీనిలో ఎప్పటికప్పుడు
జ్ఞానమును పదిలపరచి
ఆస్వాదించు అవసరమైనపుడు
పుస్తకం తెరిచి తక్షణం !
నాదైన మీదైన ఎవరిదైనా
బ్రతుకు తెరువు, కీర్తి ప్రతిష్టలు
పుస్తకంలోని మనకవసరమైన
జ్ఞానం విజ్ఞానం తోడనే.
అపుడే మన జీవనం
సుకరం శోభనం సుప్రయోజనం.
ఔనా ! కాదా ! ఏమంటారు ?!
*****
రచన:--రుద్ర మాణిక్యం (కవి రత్న)
జగిత్యాల.