బాల పంచపదులు
అంశం : చెరువు
శీర్షిక : ఊరి పరువు!
1. ఊరి చెరువు ,
ఊరికి పరువు!
తీరుస్తుంది అందరి,
నీటి కరువు!
చేప పిల్లలకు ,
భలే నెలవు!
పిల్లల ఈతకు ,
అదే గురువు!
చెరువు ,
ఊరికి పరువు, రామా!
2. పశువులు పద్ధతిలో సాగు!
పశువుల ,
చెరువున ములుగు!
కాపరులు ,
శుభ్రముగా కడుగు!
పశువులు
స్వచ్ఛతతో వెలుగు!
చెరువు ,
ఊరికి పరువు ,రామా!
3. మంచినీటి చెరువు దారి!
కావడి కుండల రహదారి!
నీరునిండి వస్తాయి మరి!
అది వారి గంగాజల సిరి!
చెరువు ,
ఊరికి పరువు, రామా!
4. చెరువు గ్రామం జీవం!
వ్యవసాయానికి అదే ప్రాణం!
విరిసిన తామరల అందం!
కన్నులకు అందంతో బంధం!
చెరువు ,
ఊరికి పరువు, రామా!
5. చెరువుగట్టు,
చక్కగా ఆకట్టు!
గ్రామానికి,
సహజమైన లాకెట్!
నిత్యం జనం ,
షికారు కట్టు!
హుషారు,
అందరికి పంచిపెట్టు!
చెరువు ,
ఊరికి పరువు, రామా!
6. చెరువులు,
ఎండిపోతున్నాయి!
గుండెలు ,
మండిపోతున్నాయి!
కబ్జాలు,
చేయబడుతున్నాయి!
దర్జాగా,
మాయమవుతున్నాయి!
చెరువు ,
ఊరికి పరువు, రామా!
7. చెరువుల్ని రక్షించాలి!
భక్షించే వారిని శిక్షించాలి!
చెరువు బతుకు తెరువు!
చెరువు లేకుంటే కరువు!
చెరువు,
ఊరికి పరువు, రామా!
_________
డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
9441058797.