నిజకార్యసముద్దరణార్థమై మహిం
బనివడి యల్పమానవునిఁ, బ్రార్థనజేయుట తప్పు గాదుగా
యనఘతఁ గృష్ణజన్మమున, నా వసుదేవుఁ మీఁదుటెత్తుగాఁ
గనుఁగొని గాలిగానికడ, కాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా!
భావం:
ఎంత గొప్పవానికైనా, సమయం వచ్చినప్పుడు నీచుని వేడుకొనుట తప్పు కాదు. పూర్వము శ్రీకృష్ణమూర్తి జన్మించినప్పుడు అతని తండ్రి వసుదేవుడు గాడిదకాళ్లు పట్టుకోలేదా?