ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁజేయకు
మాచారము విడువఁబోకుమయ్య కుమారా!
*తాత్పర్యం:*
ఓ కుమారా! ఉపాధ్యాయుని ఎదురింపవలదు. నిన్నుగాపాడిన వారిని తిట్టవద్దు. ఏదయినా ఆలోచనము చేయుటలో ఒంటరిగా జేయవద్దు. మంచి నడవడిని వదిలి పెట్టవద్దు.