నీతి కదల నెన్నొ నియమమ్ముగానేర్వ
బుద్ధి వికసనమ్ము పొందుచుండు
జ్ఞానధనము మించు సంపదలేదెందు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
తాత్పర్యము: నీతి కథలు ఎన్నింటినో తెలుసుకుంటూ ఉంటే బుద్ధి వికసిస్తుంది. జ్ఞానమనే దానాన్ని మించిన సంపద లేదు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల