యంత్రశాల లెన్నొవ్యర్థపదార్థాలు
నదులలోన విడువ నష్టమగును
కలుగు ప్రాణ హాని కలుషమ్ము వలననే
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
 
తాత్పర్యము: యంత్రశాలలో నుంచి వచ్చే ఎన్నో వ్యర్ధపదార్ధాలు, విష పదార్ధాలను నదులలో కలపడం వలన నష్టం కలుగుతుంది, కాలుష్యం పెరిగి ప్రాణ హాని జరుగుతుంది. కాబట్టి విషపదార్థాలను, కలుషితాలను నదులలో కలుపరాదు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల