చదువు మీద శ్రద్ధ చక్క గా చూపింప
మేధా పెరుగుచుండు మేటిగాను
చదువు కీర్తి నిచ్చు సౌభాగ్యమొసగును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
 
తాత్పర్యము: చదువు మీద అ చక్కగా శ్రద్ధ చూపిస్తే తెలివితేటలు గొప్పగా వస్తాయి. విద్య గొప్ప పేరు, ప్రతిష్టలను మరియు సంపదలను ఇస్తుంది. ఈ విషయాలను తెలుసుకుని చక్కగా నడుచుకో ఓ తెలుగు బాల.