రేజేటి వేంకటరమణమూర్తి;
కలంపేరు :అమరశ్రీ..✍️
ఊరు: టెక్కలి; శ్రీకాకుళం జిల్లా ;ఆంధ్రప్రదేశ్.
శీర్షిక: రెక్కలొచ్చిన పక్షి ( బాలగేయం)
మర్రిచెట్టు కొమ్మ పైన కాకి వాలింది
పుల్లపుడక ఏరు కొచ్చి గూడు కట్టింది
గూటిలోన ఆడకాకి గుడ్డు పెట్టింది
కావు కావు పిల్లకాకి బయటకొచ్చింది
తల్లి కాకి మేత తెచ్చి నోటకుడిపింది
కావు కావు పిల్లకాకి పెరగ సాగింది
రెక్కలొచ్చి పిల్లకాకి ఎగిరి పోయింది
ఒంటరిగా తల్లి కాకి మిగిలిపోయింది!
ఇది నా స్వంత రచన. దేనికీ కాపీ కాదు.
@ అమరశ్రీ...✍️