బాల పంచ పదులు
అంశం :మన ఊరి సంత
శీర్షిక:
ఉత్పత్తులు మనచెంత
1. కొండలు ,
అడవులు ఆవాసాలు!
గిరిజనుల,
నిజ నివాసాలు!
వారు స్వేదంతో,
చేసే సేద్యాలు!
ఊరి సంతల్లో,
మనకు లభ్యాలు!
సంత, ఉత్పత్తులు,
మనచెంత , రామా!
2. కొనడం ,అమ్మడం,
ముఖాముఖి!
వ్యాపారం,
నేరుగా జరగడానికి!
మూడవవాడు,
రానే రాడు మధ్యకి!
సంతే నేటికీ ,
సరి దారి మనకి!
సంత ,ఉత్పత్తులు,
మన చెంత రామా!
3. వారి మనసులు నిర్మలం!
వారి ఉత్పత్తులు సేంద్రియo!
వారు ఉంచరు రెండవ రకం!
అమ్మకంలో ఎంతో నమ్మకం!
సంత, ఉత్పత్తులు,
మన చెంత రామా!
4. సంతలో వ్యాపారం,
ఒక వంక!
వింతలు, వినోదం
మరో వంక!
పిల్లలకు సంతే,
ఓ నెలవంక!
ఓ మూల,
పాటల గోరువంక!
సంత ,ఉత్పత్తులు ,
మన చెంత రామా!
5. పుట్ట తేనె పట్టుకొస్తారు!
అసలైన కుంకుళ్ళు అందిస్తారు!
అడ్డాకులుఅమర్చిఉంచుతారు!
ఆప్యాయంగా పలకరిస్తారు!
సంత, ఉత్పత్తులు,
మన చెంత రామా!
6. వారం వారం జరిగే సంతలు!
గిరిజనులకు వేసిన వంతెనలు!
పైనుండి దేవతలై దిగివస్తారు!
తిరిగి చక్కగా వెళ్లిపోతారు!
సంత ,ఉత్పత్తులు ,
మన చెంత రామా!
7. నడకే ప్రయాణ సాధనం!
నడతే వారి ఆభరణం!
నడక, నడతల ఆచరణం!
మానవ జీవన ఆదర్శం!
సంత ,ఉత్పత్తులు,
మన చెంత రామా!
8. మనం సంత చూడటం!
లోకం, జీవితం చదవడం!
సంత ,
మానవ జీవన సంతకం!
సంత ,
జీవన మధుర జ్ఞాపకం!
సంత ,ఉత్పత్తులు,
మన చెంత రామా!
9. నేడు మాల్స్ ,
ఆధునిక సంతలు!
ఆదిపత్యం మాత్రం,
అగ్రసంస్థలు!
లాభం కబ్జా,
గుత్తాధిపత్యం!
లాభం తలోకొంత ,
సంతలో సత్యం!
సంత ,ఉత్పత్తులు,
మన చెంత రామా!
_________
డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
9441058797.