నే చూసినప్పుడల్లా తలదించుకునే ఉన్నావ్;
నే వెంటపడినప్పుడల్లా తలవంచుకునే నడుస్తూన్నే ఉన్నావ్;
నే నవ్విన నవ్వకుండనే రుసరుసలాడుతున్నావ్ !
నే పలకరించిన ఏమి పట్టిపట్టనట్లు ఉండిపోతున్నావ్;
నే మాట్లాడే సమయానికి సలసల సాగిపోతున్నావ్ ;
అది ఏమిటో నే ఏమి చేసిన పరుగుపరుగున జారి పోతున్నావ్!!
అంతుచిక్కవోయి ఓ బంగారం నీ వాలకం ఏమిటోయి ;
ఎందుకో ఆ పరుగులు, ఏమిటో నాపై చిటపటలు ;
ఇక ఆపై నే పడే తటపటలు ఇక చాలు ఈ తిరుగుళ్ళు;
నా మానాన వాలిపోయిన పొద్దులా మౌనమే మంచిదని ఉండిపోయా!
పసిడి తీగ నుండి సన్నని మృదువైన నీ స్వరాలపవనాలు తాకే;
నాలో సంబరాలు చిందులేస్తూ అంబరాలకు అంటే నా ఓ ! కొంటెదాన!
నే తలెత్తి చూస్తే నీ మనోహర రూపం! తళతళలాడే ఓ! తన్వి!!
నీ నవ్వుల మోము నాలో ఎన్నో కాంతి పుంజాలు వెదజల్లే ఓ ! నారి !
రుసరుసలాడిన నీ చెక్కిళ్ళు రంగురంగుల హరివిల్లు అయ్యే ఓ! రమణి!!
నీ పలకరింపుతో పులకరింపై ఊపు వచ్చే ఓ! పోరీ !
నీ ఇంపైన కేశసంపద నీ లే లేత పాలబుగ్గలపై పడి నన్ను మంత్రముగ్ధుని చేసే ఓ! కేశిని !!
కలత చెందిన నా మనసు నకు ఊతమించినావే ఓ ! నా మెలత !
నా ఘోష ఆలకించి నన్ను మైమరింపచేయగా వచ్చిన ఓ ! నా యోష!!
నీ పకపక కోసమే నే వేచి నీకోసమే కాచినాను ఓ! పరువాల ముత్యాల సరాల పకపకనవ్వులరాణి !!
నీతోనే నాపయనం; నీతోనే జీవనం ; నీతోనే జీవితం ; ఓ! జవరాలా !!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.