దయలేదా సామి! దయరాలేదా సామి!! దయ చూపడం మరిచావా? సామి!!!
మమ్ము చెడుగుడు ఆడుతున్న చూస్తూ ఏమీ పట్టనట్లు నటించే నటన సూత్రధారి!
లోకమంతా అల్లకల్లోలం అవుతున్న ఇసుమంత కనికరం లేక చిద్విలాసమాడే లోక నాధా!!
కాటికి కాళ్ళు చాపే వరసల వరద పొంగుతున్న ఆనందపడి,
కాపలకాస్తు వికటాహాసం తో ఆనంద భైరవి రాగం అలపించే రాగ ధారుడా!
కలిలో కనిపించని కోరలతో విషాన్ని చిమ్ముతూ విషాదాన్ని నింపుతున్న నింపాదిగా శయ్యపై హాయిగా నిద్రించే దేవా!!
అసలు నీకు దేహమే లేదని విన్నా కానీ నీకు మనసే లేదని తెలిసేలా వచ్చే సరికి !
నీవు సృష్టించిన సరికొత్త జీవి చేష్టలతో నీవు ఎన్నో యుగాల నుంచి ఏలుతూ, పాలించే మానవ జీవజాలం
క్రమంగా నశింప చేసి నీవు ఎవరిపై పెత్తనం చేస్తావు!!
అవును మేము మతి తప్పి గతి లేని దారులు తిరిగాం,మమ్ములను సరైన స్ధితిలో ఉంచడానికి ఇది నీవు ఎంచుకున్న మార్గమా?
నీకు ఇంతకంటే మంచి మార్గం దొరకలేదా?
కంటికి కనిపించని క్రిమిని మాపై ఇంపుగా వాడి చోద్యం చేస్తూ మా ప్రాణాలను నైవేద్యంగా స్వీకరిస్తూ హర్షిస్తున్నావా? దేవా !!
ఇది సరైనది కాదు సృష్టికర్త !ఓ! దేవ! దేవా!! మేమ్ము నీ ముందు ఎంత? అల్పజీవులం! కర్మఫలం!! అనుభవించే నీ వారసులం!!!
మాపై కరుణ చూపవా! మా పై జాలి కలిగించగ రావా !!
మా కష్టాలు తీర్చగా రాలేవా? మమ్ములను కాపాడగరా!! సామి!
చిన్ని క్రిమిని మా పై వదలి కదలి వెళ్ళితే ఎలా మమ్ము రక్షించే నాధుడు!నీవే !!
అందుకు సృష్టికి ప్రతిసృష్టించే మనిషి మెదడు కు పదను ఇచ్చే అదను ఇదే సామి!
ఇప్పుడు ఏమిటో కరోనా జీవి జగతిపై సెకండ్ వేవ్ ను తరిమి సేవ్ చేసే యుక్తిని,శక్తిని ప్రసాదించు సామి!! నీవు కాకపోతే ఎవరు ఉన్నారు సామి? మా తప్పులు మాఫి చేసి నీ మాయతో మా బతుకులను సాఫి చేయి!!
నీ సంతతికి భరోసా ఇవ్వు!
నిన్నే నమ్మి నిన్నే అనునిత్యం ఎల్లవేళలా, ఎందర ఎందరో పలురకాలుగా కొలిచే/ పూజించే వారు లేక
నీవు ఏ దిక్కుమొక్కు లేక ఉండిపోతే నీకు ఇష్టమా?
కాస్తంత ఆలోచన చేయి మమ్ములను శాశ్వతంగా కాపాడే పాచిక వేయి నా మనో సంకల్ప దేవ దేవా!!!!
మేము ఉంటనే నీవు నీవు ఉంటనే మేము అని మరువకు నా ప్రాణ దేవా మా జీవా దేవా!!
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.