నిన్ను నమ్ముకో నీకు మంచి
పక్కవారిని కాసింత గమనించి నమ్ము పోయేది ఏమీలేదు!
కానివారి జోలికి పోమాక పోతే పాతాళం;
నమ్మించి మోసం చేసే వారితో జత కామాక ఖతం!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
-----------------------------------------
ఒకసారి నా చేతికి చిక్కిచూడు నిన్ను నేను ఎలా మలచుకుంటానో
ఒకసారి నా వెంటబడి చూడు నేను ఏమిటో తెలుస్తోంది!
ఒకసారి నా చేతికి పైకం ఇచ్చి చూడు నరకపు దారి ఎటో తెలుస్తుంది!!
ఒకసారి నా చేతికి పగ్గాలు ఇచ్చిచూడు నేను ఎలా చేస్తానో చూద్దువు!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
-----------------------------------------------
పీటముడి వీడింది!
పిట్ మెంట్ విరిసింది!!
పిడుగు పడింది!
వేతనం వెనుకబడింది!!
ఆశజీవుల రొట్టె విరిగింది!!!
రిటైర్మెంట్ కు పండుగ/ వయస్సు/ వచ్చింది!!
ఇది చురకశ్రీ సూటిమాట!
స్వర్ణకాంతిపుంజపు బాట!!
-----------------------------------------
మా నోటికి అదుపు ఉండదు పని అయిపోయాక పొదుపు;
మా చేతికి ఎముక ఉండనే ఉండదు చేతిలో కవ్వం తిరిగినంత సులువుగా తిరుగు అవసరం తీరినాకా మాయా తిరగలిలా మూలన ఉండు ఇంతకు మేము ఎవరము?...చురకశ్రీ సూటిమాట???