తోటకు రమ్మంటావా,
కోటలో ఉండమంటావా ఊరుబయటకాపుకాయమంటావా బావా! ...తోటకు రమ్మంటావా....2 సార్లు
తోటకాడ రావద్దు కోటలో ఉండమాకు,ఊరుబయటకు రామాకే నా భామా!!..తోటకాడ....1 సారి..
మరి యాడకి రమ్మంటావు నీవు యాడ ఉంటావో చెప్పు మామో;
నీ పిలుపు కోసం,నీ సైగ కోసం చూస్తూంటా,కాపు కాచుకుంటా ఓ నా సొగ్గాడా!! ..తోటకు రమ్మంటావా...2 సార్లు..
ఒస్ ఒస్ నా మరదలా వయ్యారి మరదాల నీవేడ చూస్తూ ,కాపుకాస్తూ ఉండమాకే సంధ్యపొద్దుల్లో కలిసే సన్నజాజి చోటికే రావే గువ్వా;
నా గుండె గడిలో ఉండి పోదువులే ఓ నా జాజిమల్లే చండు ..తోటకు రమ్మంటావా....2 సార్లు
యుగళ గీతం రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.