మాతృమూర్తి విలాపం
#######################
ఓరి నా చండాలపు బిడ్డ ;నా చల్లని,వెచ్చని గర్భాన్ని నవమాసాలు విడిదిగా చేశా;
మరిప్పుడు పశుపాకను నా రాజమహల్ గడిగా చేశావు కదరా!
నిన్ను నా కొంగు బంగారంగా తలచి పట్టు పరుపు ఉయ్యాల లో పరుండబెట్ట బేటా!!
నన్ను కట్టెలు పేర్చిన భూమిపై గడ్డి పరకలో ఉంచావు కదరా కంత్రీ బిడ్డా!
నీ గుక్క నింపడానికి నా గుండెలో దాచిన రక్తాన్ని అమృతధారగా మార్చి పోశానురా!! ఓరి పనికిమాలిన పింజరాడో!
నీవేమో నన్ను లవణపు చుక్కలు నా నరాల్లో ఎక్కించావురా/ఎక్కించి చోద్యం చూస్తావూ వెధవా నా కొడకా!!
నీవు యాడ జారిపోతావని సంకలో మోశా,నీ పాదాలు ఎక్కడ కందిపోతాయి అని భుజాలు నెత్తిన పెట్టుకుని అపురూపంగా చూశా!
నీవేమో నన్ను లాగేసి రాళ్ళురప్పల మధ్య, బండెడుకట్టెల నడుమ తిప్పలపాలు చేసి పాతాళంలో నెట్టావురా పాపాత్ముడ నా ముద్దుల బిడ్డా !!
ఈ బుద్ధి నీకు వచ్చిందో నే ముచ్చట పడి కట్టబెట్టిన ఆ ఆడబిడ్డదో! కన్నప్రేగులాగుతుందిరా ఎలా పిలిచినా; అది కన్నప్రేమేరా!! అవి దీవెనలురా! అయిన నీవు హాయిగా, చల్లగా ఉండాలి నా ముద్దుల కొడుకా!!!
నే ఎప్పుడైనా జీవం వదలడం ఖాయంరా! నీ బిడ్డల కంటపడనీయకురా!! రేపటి రోజు ఈ దారిద్ర్యాన్ని నీవు ఆపలేవురా/ అనుభవించలేవు బిడ్డా!!! నా ముద్దుల కన్నయ్యా!!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి