పుస్తకమ్ము, డబ్బు, పూబోడి యొకసారి
పరులచేతిలోన పడిన యెడల
రావు, వచ్చినపుడు భ్రష్టమై యుండును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
 
తాత్పర్యం:
 
పుస్తకము, డబ్బు, పూలు ఒకసారి ఇతర చేతిలో పడిన తర్వాత తిరిగిరావు. వచ్చినా చెడిపోయి ఉంటాయి. కనుక వీటిని ఇతరులకు ఇచ్చే ముందు జాగ్రత్త పడు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల